చెరువులో పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి యువకుడి మృతి

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

చెరువులో పడి యువకుడి మృతి

కొత్తవలస: మండలంలోని పెదరావుపల్లి గ్రామం సమీపంలో గల కొత్తచెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పెంట గ్రామానికి చెందిన జామి వేణు (33) బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, సీఐ టీవీ విజయకుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేణు తన స్నేహితులతో కలిసి వారి గ్రామం నుంచి కొత్తవలస మండలంలోని హోల్‌సేల్‌ ఐరన్‌ షాపువద్దకు సామగ్రి కొనేందుకు బుధవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పెదరావుపల్లి గ్రామం సమీపంలో గల కొత్తచెరువు వద్దకు వచ్చే సరికి బహిర్భూమికని బండి ఆపి వెళ్లాడు. మిగిలిన స్నేహితులు రోడ్డుపై వేచి ఉన్నారు. వేణు ఎంతకీ రాకపోవడంతో చెరువు వద్దకు వెళ్లి చూడగా చెప్పులు, బట్టలు ఒడ్డున పడి ఉండడం గమనించి చెరువులో పడిపోయాడని నిర్ధారణకు వచ్చారు. వెంటనే పెదరావుపల్లి, పెంట గ్రామస్తులకు తెలిపి చెరువులోకి దిగి వెతకడం ప్రారంభించారు. ఈ చెరువులో గ్రావెల్‌ తవ్వకాలు జరగడంతో లోతు అధికంగా ఉండి వేణు ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు వేణు మృతదేహం లభ్యమవడంతో కుటుంబసభ్యులు భోరున విలపించారు. మృతుడికి భార్య దేవి (26), పాప కనిష్క (7), బాబుజోశ్విక్‌(1) ఉన్నారు. వేణు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో భార్య దేవి రోదన అక్కడ ఉన్నవారిని కంటితడి పెట్టించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ టీవీ విజయకుమార్‌ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు.

మృతుడు విశాఖ జిల్లా వాసిగా గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement