కరోనా వంటి కష్టకాలంలో ప్రజలకు విశేషసేవలందించాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేశాం. కేవలం నెలకు రూ.5వేలకు పనిచేసిన వారిని తొలగించి ఇప్పుడు సోషల్‌ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో ప్రభుత్వ పనితీరును ప్రచారం చేసుకునేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదు. మంచి పనులు చేస్తే ప్రచారం ఎందుకు చేసుకోవాలి.
– గవిడి భీమేశ్వరరావు, మాజీ వలంటీర్,
పోరలి, దత్తిరాజేరు మండలం
అంతా మోసమే
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చ లేదు. ఆడబిడ్డనిధి ఇస్తా మని చెప్పి పైసా కూడా ఇవ్వలేదు. గతంలో వలంటీర్లుగా పనిచేసి నెలకు రూ.5 వేలు లబ్ధిపొందేవారం. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా ముంచేసింది. ఇప్పుడేమో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనం చెల్లించేందుకు సిద్ధపడింది. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు.
– తాడ్డి సునీత, లక్ష్మీపురం, రాజాం మండలం


