విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లు, బోధనేతర సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కేజీబీవీ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. విజయనగరం జిల్లా కేంద్రానికి బుధవారం వచ్చిన కేజీబీవీ రాష్ట్ర సెక్రటరీ దేవానంద్‌రెడ్డికి ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కె.విజయగౌరి, రాష్ట్ర కార్యదర్శి కె.రమాదేవి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 352 కేజీబీవీల్లో 5,700 మంది బోధనా సిబ్బంది 2005 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారని తెలిపారు. అందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ అమలుచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి, ఇతర ప్రభుత్వ పాఠశాలల సిబ్బందితో సమానంగా సేవాప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.


