జాతీయ తైక్వాండో పోటీలకు విజయనగరం క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ తైక్వాండో పోటీలకు విజయనగరం క్రీడాకారుల ఎంపిక

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

జాతీయ తైక్వాండో పోటీలకు విజయనగరం క్రీడాకారుల ఎంపిక

విజయనగరం: శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌ కేటగిరీల్లో స్వర్ణ పతకాలు సాధించిన వీరు, జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వేదికగా అక్టోబర్‌ 2 నుంచి 4 వరకు 40వ సబ్‌ జూనియర్‌, 43వ జూనియర్‌ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో విజయనగరం జిల్లా నుంచి సబ్‌ జూనియర్‌ విభాగంలో 11 మంది, జూనియర్‌ విభాగంలో ముగ్గురు క్రీడాకారులు పాల్గొంటున్నారని జిల్లా ఒలింపిక్‌, తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు గురాన అయ్యలు, న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. వేణుగోపాలరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు అవనాపు విజయ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలోనూ క్రీడాకారులు తమ సత్తా చాటి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, చివరి వరకు క్రీడాస్ఫూర్తితో పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఎంపికై న క్రీడాకారులకు కోచ్‌లు సీహెచ్‌. యశస్విని, కిరణ్‌, రమేష్‌లతో పాటు పలువురు క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement