గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు నిస్వార్థంగా వలంటీర్‌గా ప్రజలకు సేవలందించాం. కరోనా వంటి కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వ విధులు నిర్వహించాం. నిస్వార్ధ సేవకు చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ మకిరి అంటించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేవారిని నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. ఉపాధిని దూరం చేసింది. ఇప్పుడు ప్రజాసేవకు అర్ధం తెలియని ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు సిద్ధపడింది. సేవ కంటే ప్రచారానికే పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారు.
– కర్రి సతీష్‌కుమార్, చింతాడ, బొబ్బిలి మండలం


