జిల్లాలో ముందుగానే సర్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ముందుగానే సర్‌ పూర్తి

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

● ఎన్నికల జాబితా పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ

● అక్టోబర్‌ 9న ఓటర్ల తుది జాబితా

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ నిర్ణీత గడువుకంటే ముందుగా పూర్తిచేయడంపై జిల్లా ఎన్నికల జాబితా పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ యంత్రాంగాన్ని అభినందించారు. కలెక్టరేట్‌లో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో మ్యాపింగ్‌ కాని 1,93,735 మందికి నోటీసులు ఇచ్చి, వారి వివరణ తీసుకున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. వీరిలో కేవలం 3012 మంది మాత్రమే వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించామని, మిగిలిన 1,90,724 మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చామన్నారు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని స్పష్టంచేశారు. కొద్ది రోజుల్లోనే సుమారు 14వేల మంది యువ ఓటర్లను చేర్చడాన్ని గోపాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఎక్కువ ఓట్లు చేరిక, తొలగింపులు జరిగిన చోట కనీసం 20 పోలింగ్‌ కేంద్రాలను ఈఆర్‌ఓలు వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, డీఆర్‌ఓ సీహెచ్‌ సత్తిబాబు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థి మృతిపై విచారణ

సాక్షి, పార్వతీపురం మన్యం: ఇటీవల అనసభద్ర ఏకలవ్య పాఠశాల విద్యార్థి సవర అర్పిత్‌ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ కోసం గురుకులం (ఏపీటీబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ) జాయింట్‌ సెక్రటరీని నియమించినట్లు ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. విద్యార్థి మృతి ఘటన నేపథ్యంలో ప్రిన్సిపాల్‌, వార్డెన్‌లను సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. దీనివల్ల బాధిత కుటుంబానికి ఏ ఉపయోగమూ లేదని, రూ.20 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ఇదే విషయమై పీజీఆర్‌ఎస్‌లోనూ గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ తదితరులు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement