కోవిడ్ కష్ట కాలంలో సొంత కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ప్రాణాలకు తెగించి సేవ చేశాం. నాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మమ్మల్ని డేటా చోరులని, అప్పనంగా ప్రభుత్వ డబ్బు తింటున్నారని తీవ్రంగా అవమానించారు. మేము చేసింది ప్రజాసేవ. ఇప్పుడు ఎన్నికల వాగ్దానాలైన సూపర్ సిక్స్ అమలు చేయలేక, తమ వైఫల్యాలను దాచడానికి ఇన్‌ఫ్లూయెన్సర్లకు ప్రజాధనాన్ని పంచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. వలంటీర్ల కడుపు కొట్టిన ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతాం.
– బుచ్చ శ్రీనివాస్, విజయనగరం


