బొబ్బిలి: 39వ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో రాష్ట్ర బాలికల జట్టు జయకేతనం ఎగురవేసింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాష్ట్ర జట్టును ఎంపిక చేసి ఇక్కడి పారాది జెడ్పీ హైస్కూల్‌లో సాఫ్ట్‌బాల్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో కోచింగ్ ఇచ్చారు. ఇటవల మహారాష్ట్ర లోని శంభాజీ నగర్‌లో పోటీలకు రాష్ట్ర జట్టు వెళ్లింది. ఈ పోటీల్లో రాష్ట్ర బాలికల జట్టు అలవోకగా ఫైనల్స్‌కు చేరి కేరళ జట్టుపై 4–3 రన్స్ తేడాతో గెలుపొందింది. ఎమ్మెల్యే బేబీ నాయన, సాఫ్ట్ బాల్ సంఘ కార్యవర్గం సుంకరి సాయిరమేష్, అల్లాడ భాస్కర రావులు క్యాంప్‌ను నిర్వహించారు. బుధవారం జరిగిన పోటీలో ఆంధ్రజట్టు గెలవడంతో అందరూ జట్టు సభ్యులకు, పీడీలకు అభినందనలు తెలిపారు. కాగా బాలుర జట్టు సెమీఫైనల్స్‌లో రాజస్థాన్ జట్టుపై ఓటమి చెంది నాలుగో స్థానంతో సరిపెట్టుకుందని పీడీ ఎన్.వెంకటనాయుడు విలేకరులకు తెలిపారు. సాఫ్ట్‌బాల్ రాష్ట్ర జట్లను ఎంపిక చేయడమే కాకుండా వారి కి మంచి తర్ఫీదునిచ్చినందుకు పీడీని, నిర్వాహకులను స్థానికులు అభినందిస్తున్నారు.


