పార్వతీపురం రూరల్: రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సహాధ్యక్షుడిగా ఎన్నికై న పార్వతీపురం మన్యం జిల్లా సంఘం అధ్యక్షుడు గొట్టాపు శ్రీరామమూర్తికి స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానం జరిగింది. మన్యం ప్రాంత ఉద్యోగుల గొంతుకకు రాష్ట్రస్థాయిలో సరైన ప్రాతినిధ్యం దక్కడం పట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సీహెచ్.కృష్ణమూర్తి, తనను ప్రతిపాదించిన జోన్‌న్–1 నాయకత్వం, సహకరించిన సీసీఎల్‌ఏ యూనిట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి శాయశక్తులా కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, పరిపాలనాధికారి పి.రమేష్ కుమార్, ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిషోర్, జిల్లా కోశాధికారి పీఎస్‌ఎల్ కుమార్, సహాధ్యక్షుడు సీహెచ్ రాధాకృష్ణమూర్తి, సెక్రటరీ రాజేష్, కలెక్టరేట్– డివిజన్ యూనిట్ అధ్యక్షుడు బాలమురళీకృష్ణ, చంద్రమౌళి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరావు, వివిధ మండలాల తహసీల్దార్లు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు మనోరాభాయ్, అప్పలరాజు, సత్యారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.


