హృదయం పదిలమని..! | - | Sakshi
Sakshi News home page

హృదయం పదిలమని..!

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

జీవన శైలిలో మార్పులే కారణం

గతంలో కంటే ప్రస్తుతం మానవుల జీవన శైలిలో మార్పుల వల్లే తక్కువ వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ధూమపానం కొకై న్‌, డ్రగ్స్‌, ఖైనీ, గుట్కా, వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయమం లేకపోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల గుండె పోటు వస్తుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. జంక్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

– డాక్టర్‌ ఆదిత్య నుషేన్‌, కార్డియాలజిస్టు

విజయనగరం ఫోర్ట్‌: విజయనగరం పట్టణానికి చెందిన రమేష్‌ అనే 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుకు గురికావడంతో బంధువులు వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

● ఎస్‌.కోట మండలానికి చెందిన కిశోర్‌ అనే 50 ఏళ్లవ్యక్తికి ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లాలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు గుండె జబ్బుల బారిన పడుతుండడం గమనార్హం. గతంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు గుండెపోటుకు గురయ్యేవారు. ప్రస్తుతం 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గతంలో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. లిపిడ్‌ ప్రొపెల్‌ వైద్య పరీక్షల్లో 35 శాతం మందికి ట్రెగిజరైడ్స్‌ ఎక్కువగా ఉన్నాయని, ఇవి గుండెకు అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరిక వివాహం వంటి కారణాలతో పుట్టుకతో గుండె

జబ్బులతో జన్మించే పిల్లలు ఇటీవల ఎక్కువయ్యారు. గుండెను చేతితో పట్టుకుని 35 ఏళ్ల లోపు వారే అధికంగా వస్తున్నారు. జిల్లాలో నెలకు 10 వేల మంది వరకు ఈసీజీలు, వెయ్యిమందికి పైగా 2డీఈకో పరీక్షలు, 100 మంది వరకు యాంజియోగ్రామ్‌ పరీక్షలు చేస్తున్నారు.

గుండె నొప్పి లక్షణాలు

గుండెపోటుకు గురైన సమయంలో ఛాతీలో నొప్పి విపరీతంగా ఉంటుంది. విపరీతమైన చెమటపడుతుంది. వాంతివచ్చే భావన ఉంటుంది. ఒక్కోసారివాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లు చేతులు చల్లబడతాయి. గుండె ఆగిఆగి కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఛాతీలో అసౌకర్యంగా ఉన్నా ఏదో బరువు ఛాతీపై పెట్టినట్లు అనిపిస్తున్నా శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండెపోటు సూచనగా భావించాలి. ఛాతీలో నొప్పి వచ్చి అది ఎడమచేయి భుజంలోకి పాకుతున్నా, విపరీతంగా చెమటలు పడుతున్నా గుండె పోటుగా అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా అనుమానంతో వైద్యులను సంప్రదించడం మంచిది.

గుండె పరిరక్షణ ఇలా

పిల్లలను జంక్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కనీసం అరగంట పాటు వ్యాయమం చేయాలి. చికెన్‌ లెగ్స్‌, అధిక కొలెస్ట్రాల్‌ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలి.

గుండెను పరిరక్షించుకోవాలి

నేడు ప్రపంచ గుండె దినోత్సవం

అధికంగా గుండె జబ్బుల బారిన పడిన వారి సంఖ్య

హైబీపీ, ఊబకాయం

కారణమంటున్న వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement