ఆర్చరీ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆర్చరీ పోటీలు ప్రారంభం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో 46వ జూనియర్‌ రిజర్వ్‌ కాంపౌండ్‌ అండ్‌ ఇండియన్‌ రౌండ్‌ చాంపియన్‌షిప్‌ ఆర్చరీ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్‌, గ్రూప్‌కెప్టెన్‌ ఎస్‌.ఎస్‌.శాస్త్రిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి మేలు చేస్తాయని, ఆర్చరీ పోటీలు ఏకాగ్రత సాధించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. 70 మీటర్ల విభాగంలో నిర్వహించిన పోటీల్లో సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు, ఎన్‌సీఎస్‌ ట్రస్టీలు నారాయణం చలమయ్య, మృదుల, నీరజా శ్రీనివాస్‌, చంద్రకళ, పలువురు ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement