విజయనగరం: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం జరిగిన 37వ ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌న్‌షిప్ పోటీలలో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ పోటీలలో 21 కేజీల విభాగంలో కె. లలితాదీత్య కాంస్య పతకం సాధించగా, 30 కేజీల విభాగంలో హర్షిణి వర్మ, 33 కేజీల విభాగంలో ఎం. హసిక రజత పతకాలను గెలుపొందారు. అలాగే 35 కేజీల విభాగంలో జి. కాత్యాయని కాంస్య పతకం పొందగా, 52 కేజీల కేటగిరీలో డి.మాధవ్, 74 కేజీల కేటగిరీలో కె.ఆదర్శ్ రజత పతకాలతో మెరిశారు. కోచ్ కె.మోహిత్ ఆధ్వర్యంలో విజయనగరం కె–వన్ వ్యవస్థాపకుడు, పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి ఎం.కూర్మారావు క్రీడాకారులకు నిరంతర శిక్షణ అందించి తీర్చిదిద్దారు. రాష్ట్రస్థాయిలో విశేష ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తెచ్చిన విజేతలను, వారిని ప్రోత్సహించిన శిక్షకులను ఎం.కూర్మారావు, నిర్వాహకులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.


