అవార్డు గ్రహీత గోపీనాథ్‌ పట్నాయక్‌కు సత్కారం | - | Sakshi
Sakshi News home page

అవార్డు గ్రహీత గోపీనాథ్‌ పట్నాయక్‌కు సత్కారం

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

విజయనగరం: నగరానికి చెందిన పక్కి గోపీనాథ్‌ పట్నాయక్‌ హైదరాబాద్‌లోని త్యాగరాయ గాన సభలో వంశీ ఏఎన్‌ఆర్‌ కామధేను జాతీయ పురస్కారాన్ని అందుకోవడం విజయనగరం జిల్లాకు గర్వకారణం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవా సాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం తన క్యాంప్‌ కార్యాలయంలో గోపీనాథ్‌ పట్నాయక్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఉత్తమ ప్రజా సంబంధాల వ్యక్తిగత కేటగిరీలో మన విజయనగరానికి చెందిన గోపీనాథ్‌ పట్నాయక్‌ కు హైదరాబాద్‌ వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, తెలంగాణ తెలుగు అకాడమీ అధ్యక్షుడు కూరపాటి వంశీ రామరాజు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. గోపీనాథ్‌ పట్నాయక్‌ పట్టణంలోని రాజకీయ పార్టీల నాయకులతో, అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉంటారని అటువంటి వ్యక్తికి అవార్డు రావడం సమాజం పట్ల మరింత బాధ్యతను పెంచుతుందని, భవిష్యత్తులో ఇటువంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement