● తీరప్రాంతంలో తస్మాత్‌.. | - | Sakshi
Sakshi News home page

● తీరప్రాంతంలో తస్మాత్‌..

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

పూసపాటిరేగ: తీరప్రాంత గ్రామాలలో అంగన్‌వాడీ కేంద్రాలలో కార్యకర్తలు వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తతతో వ్యవహరించాలని ఐసీడీఎస్‌ పీడీ కేవీ బాలమణి సూచించారు. భోగాపురం మండలంలోని తీరప్రాంత గ్రామాలైన ముక్కాం–1, 2, 3, తోటపల్లి, ముంజేరు – 1 అంగన్‌వాడీ కేంద్రాలను ముందస్తు చర్యలలో భాగంగా మంగళవారం ఆమె సందర్శించారు. కార్యకర్తలకు తుఫాన్‌ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తీరప్రాంతాలలో అంగన్‌వాడీ కేంద్రాలలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పీఓ లావణ్యను ఆదేశించారు. ఆమెతో భోగాపురం ఐసీడీఎస్‌ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ హేమ తదితరులు వున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement