విజయనగరం ఫోర్ట్: సీ్త్ర,శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న సమగ్రశిశు అభివృద్ధి పథక అధికారులకు (సీడీపీఓలకు) బదిలీ అయింది. ఈ మేరకు సీ్త్ర,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు కార్యాలయానికి, సీడీపీఓలకు ఉత్తర్వులు అందాయి. విజయనగరం సీడీపీఓకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు, భోగాపురం సీడీపీఓకు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరికి, రాజాం ఏసీడీపీఓ(ఎఫ్‌ఏసీ)కు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలుకు బదిలీ అయింది. రాజాం సీడీపీఓకు పార్వతీపురం మన్యం జిల్లాకు పీడీగా బదిలీ అయితే ఆమె అక్కడ విధుల్లో చేరారు. అల్లూరి సీతారామరాజుజిల్లాకు బదిలీ అయిన ముగ్గురుకు బదిలీ ఉత్తర్వులు వచ్చి ఐదు రోజులైనా ఇంకా ఇక్కడే కొనసాగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 317 అంగన్‌వాడీ కేంద్రాలు, రాజాం ప్రాజెక్టు పరిధిలో 339, భోగాపురం ప్రాజెక్టు పరిధిలో 272 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. కొందరు అధికారులు బదిలీలను నిలుపుదల చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
బదిలీ ఉత్తర్వులు వచ్చాయి
సీడీపీఓల బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఇంకా రిలీవ్ చేయలేదు. ప్రస్తుతానికి వారు ఇక్కడే ఉన్నారు. పై నుంచి వచ్చే ఆదేశాల మేరకు రిలీవ్ చేస్తాం.
– కె.వి.బాలామణి, పీడీ, ఐసీడీఎస్


