జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు పలువురు జిల్లా క్రీడాకారులకు అవకాశం లభించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి సౌత్‌ జోన్‌ అథ్లెటిక్స్‌ పోటీలు అర్హత సాధించారు. జావిలిన్‌ త్రోలో ఉదయ్‌, 400 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్‌.సందీప్‌, త్రిపుల్‌ జంప్‌లో పి.పవన్‌కళ్యాణ్‌, 400/800 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్‌.యశోద జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, శ్రీకాంత్‌, కోశాధికారి ఆనంద్‌కిషోర్‌లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement