● చంద్రబాబుది మోసపూరిత పాలన
● పట్టుదలతో పని చేయాలి
● పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం
చంద్రబాబు ప్రభుత్వంలో వెనుకబడిన గిరిజనుల సంక్షేమం పట్టకుండా పోయింది. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడదాం. వారి సమస్యలపై పోరాటం చేద్దాం. వెన్నుపోటు పార్టీ చేస్తున్న మోసాలను ఇంటింటికీ వెళ్లి వివరిద్దాం. స్థానిక ఎన్నికల్లో విజయం దక్కించుకుందాం. – పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు
ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత పాలన. సూపర్‌సిక్స్ అట్టర్‌ప్లాప్ అయ్యింది. రెండున్నరేళ్లుగా పింఛన్లు లేవు. నిరుద్యోగ భృతిలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500 ఇవ్వడంలేదు. బియ్యం, నిత్యవాసరాల ధరలు పెరిగిపోయాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, పార్టీని గెలిపించుకుందాం. – కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మోసకారి పాలనకు అడ్డుకట్ట వేయడంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా తీసుకోవాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో పని చేయాలి. ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం కావాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలి.
– శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి
2029 ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హమీలు, అసత్య ప్రచారాల కారణంగా ఓటమి పాలయ్యాం. గతంలో ఇలాంటి పరిస్థితిని చూశాం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఏకతాటిపై పని చేద్దాం. బొత్స సత్యానారాయణ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ విజయం కోసం కృషి చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం. – కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్.కోట
మోసపూరిత హమీలతో కూటమి నేతలు గద్దెనెక్కారు. వాటిని అమలు చేయకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నడుచుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిక్కడు దొరకుడు అన్న చందంగా తిరుగుతున్నారు. నారా లోకేశ్ రక్తచరిత్ర చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాళ్లగే మోసగాడులా పాలన సాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒట్టేసిఒక మాట ఓట్టేయకుండా ఓ మాట చెప్పనన్న చందంగా పాలన సాగిస్తే... కూటమినేతలు ఇచ్చిన హమీలను విస్మరించి పాలన సాగిస్తున్నారు. – డాక్టర్ తలే రాజేష్, నియోజకవర్గ సమన్వయకర్త, రాజాం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పాలనను, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో తేడాలను ప్రజలకు వివరించాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇచ్చిన హమీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతూ పబ్బంగడుపుతోంది. ప్రజలంతా వైఎస్సార్‌షీపీ వైపే చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పార్టీకి పూర్వవైభం తీసుకొద్దాం.
– డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్సీ
ఏ రంగంలోనైనా గెలుపు ఇచ్చే గౌరవం వెలకట్టలేనిది. ప్రధాన రాజకీయాల్లో విజయం సాధించిన వారికి దక్కే గౌరవ మర్యాదలు చెప్పనక్కర్లేదు. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలకు ఆయా స్థాయిల్లో అధికారులు, ప్రజలు మర్యాద ఇస్తారు. అది సాధించుకోవాలంటూ కష్టపడి పనిచేయాలి. స్థానిక సమరానికి సన్నద్ధం కావాలి. కూటమి ప్రభుత్వం మోసాలను, అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
– బడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, నెల్లిమర్ల
బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పని చేస్తోన్న వైఎస్సార్‌సీపీలో రానున్న రోజుల్లో కార్యకర్తలకే పెద్ద పీట వేస్తాం. ఇప్పుడు నియమించిన గ్రామ కమిటీల్లోని సభ్యులతోనే పాలన సాగుతుంది. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ఏకై క లక్ష్యం కావాలి. ప్రజల కూడా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నారు. ఓటుతో తమ వ్యతిరేకతను చూపిస్తారు. – బొత్స అప్పనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం


