దబ్బిరాజుపేటలో చోరీ | - | Sakshi
Sakshi News home page

దబ్బిరాజుపేటలో చోరీ

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

దబ్బిరాజుపేటలో చోరీ

ఐదు తులాల బంగారు ఆభరణాలు,

రూ. 97 వేల నగదు అపహరణ

వేపాడ: మండలంలోని వల్లంపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధి దబ్బిరాజుపేటలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుదర్శన్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వానపల్లి సూర్యకుమారి (అంగన్‌వాడీ కార్యకర్త ) 15 రోజుల కిందట ఇంటిలోని బీరువాలో ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ. 97 వేల నగదు పెట్టంది. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు వాటిని తీద్దామని బీరువా తెరిస్తే బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. ఎప్పుడు చోరీ జరిగిందో కూడా అర్థం కావడం లేదని బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విజయనగరం నుంచి క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement