రాజాం: ఏ పార్టీ జెండానైనా సాధించిన విజయాలు, అందించిన సంక్షేమ పథకాలు, తమ సిద్ధాంతాలకు మద్దతుగా ప్రదర్శించడం పరిపాటి. టీడీపీ జెండాలను మాత్రం అక్రమ సంపాదనకు, వ్యాపారానికి అడ్డు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
విజయనగరం జిల్లా రాజాం మండలం ముద్దాడజోగివలస (ఎం.జె.వలస) గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఓ టీడీపీ కార్యకర్త పసుపు జెండా సాక్షిగా బెల్టుషాపు నిర్వహిస్తూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నాడు.
అధికారుల దాడులు ఉండకూడదని బడ్డీకొట్టుకు టీడీపీ జెండా కట్టాడు. రాత్రి, పగలు తేడాలేకుండా విక్రయాలు జరుపుతున్నాడు. గ్రామంలో ఏడాదిపాటు మద్యం విక్రయించుకునేందుకు రూ.1.50 లక్షలకు ఈ వ్యాపారి వేలం పాడుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.50లు వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
దర్జాగా బెల్టుషాపు నిర్వహణ
బెల్టుషాపుపై టీడీపీ జెండా
బెల్టుషాపులో మద్యం విక్రయాలు


