రాజాం: రాజాం పట్టణంలో స్వాతంత్య్ర సాధనకు చిహ్నంగా మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి శెగిడి వీధిలో గుడి కట్టారు. ఆ వీధికి గాంధీ వీధిగా నామకరణం చేశారు. 1996లో దాత దొంతంశెట్టి రమణ సాయంతో పైడిరాజు, డి.మలయ్య గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏటా స్వాతంత్య్రవేడుకలతో పాటు గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. జాతీయోధ్యమ స్ఫూర్తిని వీధివాసులకు వివరిస్తారు.
రాజాం సిటీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజాం పట్టణ పరిధి కస్సావీధికి చెందిన సూక్ష్మ చిత్రకళాకారుడు ముగడ జగదీష్ రూపొందించిన సూక్ష్మ వెండి భారతదేశం పలువురిని ఆకట్టుకుంది. 2.200 మిల్లీ గ్రాముల వెండితో 3 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీ మీటర్ల వెడల్పుతో భారతదేశ చిత్రపటం, అందులో జాతీయ జెండాను రూపొందించారు. దీనిని తయారుచేయడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు.
గాంధీ గుడి
ఆకట్టుకున్న వెండి భారత్


