● బీఎస్‌ఎన్‌ఎల్ డిప్యూటీ జీఎం సత్యప్రసాద్
విజయనగరం క్రైమ్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డు అందజేస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ మేనేజర్ సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక టెలికం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వన్ రూపీ సిమ్ వేసుకుంటే రోజుకు వన్ జీబీ డేటా, వంద ఎస్‌ఎంఎస్‌లు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుందన్నారు. మారుమూల గ్రామాలకు సైతం బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేవీ పరిజ్ఞానంతో 4జీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏజీంఎం సేల్స్ హెడ్ శ్రీధర్, నెట్‌వర్క్ హెడ్ మురళీధర్, డీఈలు శారద, దాలినాయుడు, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


