వంగర: మండల పరిధి మగ్గూరు గ్రామానికి చెందిన మూడడ్ల బాలకృష్ణ (46) పాముకాటుతో గురువారం మృతి చెందినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వచ్చిన బాలకృష్ణకు పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి బాధితుడ్ని రాజాం సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


