శుభకార్యాలకు వేళాయె..! | - | Sakshi
Sakshi News home page

శుభకార్యాలకు వేళాయె..!

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

శుభకార్యాలకు వేళాయె..!

వీరఘట్టం: సకల శుభాల శ్రావణ మాసం వచ్చేసింది. పూజలు, నోములు, వ్రతాలకు నెలవైన శ్రావణమాసం ఈనెల 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది. అందుచేత మహిళలు ఈరోజును ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు.గత నెల రోజులుగా ఆషాడం కావడంతో ముహూర్తాలు లేవు. ఈనెల 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్ష్మికి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ నెలలో వచ్చే శుక్రవారాలను వ్రతాలకు, నోములకు కేటాయించడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి నక్షత్రం కూడా శ్రవణమే. కావున ఆయన భార్య లక్ష్మీదేవికి, సోదరి గౌరికి శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు చేస్తారు.

శ్రావణమాసానికి అత్యంత ప్రాధాన్యం

సకల సుఖాలను ఒసగే శ్రావణ మాసం జ్ఞానస్ధితిని అందిస్తుంది.హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణమాసంలో వైష్ణవారాధనతో పాటు మహాశివునికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచిముహూర్తాలు ఉన్నాయి.

నేటినుంచి శ్రావణం మాసం ప్రారంభం

ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం

28న రాఖీ పండగ

సెప్టెంబర్‌ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి

పూజలు చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళలు

పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా లెక్కిస్తారు.శ్రావణంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పైళ్లెన తర్వాత ఏడాది వరకు ఆచరిస్తారు.వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు.ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు.

ముఖ్యమైన పండగలు..

శ్రావణ మాసమంతా పండగల సందడి ఉంటుంది.ఈ నెల 14న తొలి శుక్రవారం ఆగస్టు 21న రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం,ఆగస్టు 28న మూడవ శుక్రవారం రాఖీ పండగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, అంతేకాకుండా అదే రోజు హయగ్రీవ జయంతి, సంతోషిమాత జన్మదినం కూడా. సెప్టెంబర్‌ 4న నాల్గవ శుక్రవారం, అదే రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండగలు శ్రావణ మాసంలో ఉన్నాయి.సెప్టెంబర్‌ 11న ఐదవ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది.శ్రావణం పూర్తయిన వెంటనే ప్రారంభమయ్యే భాద్రపదం మాసం ఈ ఏడాది సెప్టెంబర్‌ 14న జరగనున్న వినాయకచవితితో ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభాకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో 14,15,16,17,20,21,22,23,26,27,28,30,31 అలాగే సెప్టెంబర్‌లో 4,5,6,7 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement