పశువులపై సర్కారు పగ..! | - | Sakshi
Sakshi News home page

పశువులపై సర్కారు పగ..!

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

పశువులపై సర్కారు పగ..!

రామభద్రపురం: ఏటా ప్రకృతి వైరీత్యాలతో పంటలను నష్టపోతున్న అన్నదాతలను ఆదుకునేది పాడి పరిశ్రమే. అందుకే పల్లెల్లో ప్రతి ఇంటా దాదాపు 80 శాతం రైతులు పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే పశుసంపద, పాడి ఉత్పత్తులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపించనుందనే ఆందోళన వ్యక్తమమవుతోంది.గడ్డి లేక పశువులు, జీవాలు అలమటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందంటూ నాలుగు నెలలుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంలో పశుసంవర్థకశాఖ ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో జంతుజాలానికి కష్టకాలం దాపురించే ప్రమాదం లేకపోలేదు. జిల్లాలో ఆవులు, ఎద్దులు 3,28,891, గేదె జాతి 81,648, గొర్రెలు 52,232, మేకలు 1,50,613 ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు గమనిస్తే పశువులు,జీవాలు ఎల్‌నినో గండం నుంచి గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. రెండు నెలలకు పైగా తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు బోసిపోతున్నాయి. వాటికి తోడు పంటల విస్తీర్ణం తగ్గిపోతుడండంతో పశుగ్రాసం లభ్యత అంతంతమాత్రంగానే ఉన్నట్లు కనిసిస్తోంది. దీంతో మేత, నీళ్లు లేక పశువులు, మూగజీవాల మనుగడకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయా రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సబ్సిడీపై అందని దాణా

ఎల్‌నినో ప్రభావంతో ఎండుతున్న పచ్చిక బయళ్లు

ఆర్‌ఎఎస్‌కేలలో వైద్యం దూరం

పశుసంతతి, పాడి తగ్గుముఖం పట్టే ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement