ఉత్సాహంగా ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎంపిక పోటీలు

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

ఉత్సాహంగా ఎంపిక పోటీలు

పార్వతీపురం రూరల్‌: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి చాంపియన్‌న్‌షిప్‌–2026’ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగాయి. స్థానిక శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల, డీఎస్‌ ఇండోర్‌ స్టేడియం, ఆఫీసర్స్‌ క్లబ్‌ వేదికగా జరిగిన ఈ క్రీడా సంగ్రామంలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.అండర్‌–17, అండర్‌–23 విభాగాల్లో నిర్వహించిన బాక్సింగ్‌, చదరంగం, ఖో–ఖో, యోగా, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో యువత తమ ప్రతిభ చాటారు. అండర్‌–17 చెస్‌లో బాలుర విభాగంలో జి.చైతన్య, టి.గిరి ప్రకాష్‌, బాలికల విభాగంలో వి.మహాలక్ష్మి, వి.చిరుమనస అగ్రస్థానాల్లో నిలిచారు. ఖో–ఖో (బాలురు, బాలికలు) రెండు విభాగాల్లోనూ పాలకొండ జట్లు ప్రథమ, కురుపాం జట్లు ద్వితీయ స్థానాలను కై వసం చేసుకున్నాయి. బాక్సింగ్‌లో రోహిత్‌, పుష్కర్‌, తేజస్విని, మనీషా..యోగాలో జి.భారత్‌ అఖిల్‌, పి.గాయత్రి, పి.జాహ్నవి సత్తా చాటారు. అండర్‌–23 విభాగంలో చెస్‌లో ఎస్‌.దేవా, బి.సూర్య..యోగాలో కె.స్వాతి, కె.సాయిసుధ విజేతలుగా నిలిచారు.వివిధ క్రీడాంశాల్లోని 23 కేటగిరీలకు గాను రాష్ట్రస్థాయికి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) కె.శ్రీధరరావు వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి పి.మురళితో పాటు పలువురు ఇనన్‌చార్జులు, క్రీడా ప్రాధికార సంస్థ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement