ఫిబ్రవరి నాటికి రీ సర్వే పూర్తి కావాలి | - | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి నాటికి రీ సర్వే పూర్తి కావాలి

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

–8లో

–8లో

రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం

హోంగార్డ్‌ కుటుంబానికి చేయూత

పోలీసుశాఖలో హోంగార్డ్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన చిట్టినాయుడికి హోంగార్డ్‌ సిబ్బంది ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్‌ రూ.3.69 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు.

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో రీ–సర్వే ప్రక్రియ వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో రీ–సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22ఏ, మ్యుటేషన్లు, రెవెన్యూ, పీజీఆర్‌ఎస్‌ అంశాలపై చర్చించారు. రీ–సర్వే, పాసుపుస్తకాల పంపిణీ పూర్తయితే భూ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని తెలిపారు. సుమారు 1.30 లక్షల జాయింట్‌ ఎల్పీఎంలలో అత్యధికం విడదీయడంతో ఫిర్యాదులు తగ్గాయని, మిగిలిన వాటిని కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్‌ నెలాఖరుకు 50 గ్రామాల్లో రీ–సర్వే పూర్తి చేయాలని జేసీ సేతు మాధవన్‌ ఆదేశించారు. ఫేజ్‌–4, 5లో పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలని, పీపీబీల పంపిణీని పూర్తి చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సీహెచ్‌.సత్తిబాబు, విజయనగరం ఆర్డీఓ సుధాసాగర్‌, సర్వే ఏడీ విజయ్‌కుమార్‌ ప్రత్యక్షంగా హాజరుకాగా, ఆన్‌లైన్‌లో ఇతర ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement