గుండెపోటుతో టీచర్‌ శ్రీనివాసరావు మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో టీచర్‌ శ్రీనివాసరావు మృతి

Jul 21 2026 12:29 AM | Updated on Jul 21 2026 12:29 AM

బాడంగి: మండలంలోని ముగడ గ్రామానికి చెందిన టీచర్‌ మత్స శ్రీనివాసరావు(61) గుండెపోటుతో సోమవారం ఆకశ్మికంగా మృతిచెందారు. ఆయన బొబ్బిలి నరేంద్ర మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వరలక్ష్మి, ఐబీఎంకు ఎంపికై న కుమార్తె యశస్విని, జేఎన్‌టీయూ విజయనగరంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న కుమారుడు కార్తికేయ ఉన్నారు. తన అత్తవారు సీతానగరం మండలం జగ్గునాయుడుపేట ఆదివారం వెళ్లిన ఆయన ఉదయం పాఠశాలకు వెళ్లాలని స్నానానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడని బంధువులు తెలిపారు. ఆయన మృతితో ముగడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో ఏడాదిలోగా ఉద్యోగ విరమణచేయనున్న సమయంలో ఇలాజరగడం పట్ల గ్రామస్తులు విషణ్ణవదనాలతో మాట్లాడుకున్నారు.

వివాహిత ఆత్మహత్య

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి మండలం కొండశంభాం గ్రామానికి చెందిన వివాహిత పిల్లా శ్రీలక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి గరివిడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చీపురుపల్లి మండలంలోని కరకాం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మికి కొండశంభాం గ్రామానికి చెందిన పిల్లా సాయితో ఈ నెల 2వ తేదీన వివాహం జరిగింది. శ్రీలక్ష్మి గతంలో హైద్రాబాద్‌లో ఉద్యోగం చేసేది. హైదరాబాద్‌లో ఉండేటప్పుడు ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండేదన్న విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ విషయాన్ని తన భర్త తండ్రికి తెలియజేస్తే తట్టుకోలేడని మనస్తాపం చెందిన శ్రీలక్ష్మి ఈ నెల 17న పురుగు మందు తాగేసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమెను వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి కడగల బంగారునాయుడు ఫిర్యాదు మేరకు ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుక్కలదాడిలో

5 మేకలు హతం

సీతానగరం: మండలంలోని ఏగోటివలస గ్రామానికి చెందిన కోడిబోను సింహాచలం సాలలో ఉన్న మేకలు, గొర్రెలపై సోమవారం రాత్రి కుక్కలు దాడి చేసి 5 మేకలను హతమార్చాయి. పగలంతా పొలాల్లో మేతకు తిప్పి ఇంటికి వచి గొర్రెలు, మేకలు సాలకు చేరుకున్న కొద్దిసేపటికే కుక్కలు చొరబడ్డాయని బాధితుడు వాపోయాడు. గడిచిన నెలలో ఇదే సాలలో ఉన్న మేకలపై కుక్కలు దాడిచేసి 6 మేకలు, గొర్రెలను హతమార్చిన విషయం తెలిసిందే. వీధికుక్కలు పగబట్టినట్లు తన జీవనోపాధిపై దెబ్బ కొట్టడంతో జీర్ణించుకోలేక సింహాచలం కుటుంబీకులు భోరున విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement