ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదు
విజయనగరం గంటస్తంభం: కమ్యూనిజం అంతరించిపోయిందని భావించే వారికి సీపీఐకి ఉన్న వందేళ్ల ఉద్యమ చరిత్రే గట్టి సమాధానమని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. నగరంలోని పడమర బలిజి వీధిలో సీపీఐ 101వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన..సూర్యచంద్రులున్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని, దానికి అంతం లేదని, కమ్యూనిజం గుర్తుగా ఉన్న ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదన్నారు. అంతకుముందు అమరజీవి, కామ్రేడ్ మొకర అప్పారావు విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల కోసం ఆ పార్టీ చేసిన పోరాటాలు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రమణమ్మ, పావని, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


