వన దేవతలకు ప్రత్యేక పూజలు
జియ్యమ్మవలస: మండలంలోని తూర్పుముఠా ప్రాంతంలో గల టీకే జమ్ము, చినదోడిజ, పెదదోడిజ, కొండచిలకాం, పిటిమండ పంచాయతీ పరిధిలోని గిరిజనులు కందికొత్తల పండగలో భాగంగా వన దేవ తలకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా డప్పులు, సాంప్ర దాయ వాయిద్యాల నడుమ గిరిజనులంతా ఒక చోటకు చేరుకుని వనదేవతలైన గొడ్డలమ్మ, సాతారమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. పంటలను వనదేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత సామూహిక భోజనాలు చేస్తామని గిరిజనులు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి.


