రెండు ఆటోలు ఢీ..
రాజాం సిటీ: మండల పరిధి కొత్తపేట సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొన్న సంఘటనలో పలువురు గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం నుంచి ఐదుగురు వ్యక్తులతో రాజాం వస్తున్న ఆటో.. రాజాం వైపు నుంచి తెర్లాం వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్లతో పాటు పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలెట్ గౌరీశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి అనంతరం బాధితులను రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన కారాడ గ్రామానికి చెందిన యాండ్రాపు నారాయణమ్మ, తెర్లాంనకు చెందిన సింగిరెడ్డి దివ్య, గదబవలసకు చెందిన దువ్వి లక్ష్మణరావు, నాషత్‌లను శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అలాగే పొట్టా యశోదను రాజాం కేర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జామి అప్పలనాయుడు, పచ్చికాల వరలక్ష్మి, యండమూరి గణేష్‌లకు కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పలువురికి గాయాలు
రెండు ఆటోలు ఢీ..
రెండు ఆటోలు ఢీ..


