ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్‌లో సీతం విద్యార్ధ
విజయనగరం అర్బన్: గాజులరేగ పరిధిలోని సీతం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ 2025–26 లో అద్భుత ప్రదర్శన కనబరిచి పలు పతకాలు సాధించారు. ఇటీవల మహారాజా పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో అథ్లెటిక్స్, వివిధ గేమ్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో కె.దీక్ష బాలికల విభాగంలో 800 మీటర్ల రన్నింగ్‌లో బంగారు పతకం, 200 మీటర్ల రన్నింగ్‌లో కాంస్యపతకం సాధించింది. జి.పవన్‌కుమార్ బాలుర విభాగంలో ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించగా బాలుర విభాగంలో బాల్ బ్యాడ్మింటన్ జట్టుకు తృతీయ స్థానం లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వివిధ విభాగాల అధిపతులు విజేతలను అభినందించారు.


