సాహితీ సౌరభం బలివాడ కాంతారావు | - | Sakshi
Sakshi News home page

సాహితీ సౌరభం బలివాడ కాంతారావు

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

సీతంపేట: తెలుగు సాహిత్యానికి బలివాడ కాంతారావు చేసిన సేవలు, ఆయన రచనలు ఎప్పటికీ మరువలేనివని సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకురాలు సి. మృణాళిని అన్నారు. విశాఖలో శనివారం బలివాడ కాంతారావు శతజయంతి సదస్సు ఘనంగా జరిగింది.ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో సాహిత్య అకాడమీ, రైటర్స్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మృణాళిని మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో బలివాడ కాంతారావుకు రావాల్సిన గుర్తింపు లభించలేదని అన్నారు. ఆయన రచనల్లో అన్ని నవరసాలు కనిపిస్తాయని, వివిధ ప్రాంతాల అనుభవాలను రచనల్లో ప్రతిబింబించిన వైవిధ్యభరిత రచయిత అని కొనియాడారు.ప్రముఖ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంతారావు కథలు, నవలలు భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయని, పలు పత్రికల్లో సీరియల్స్‌గా ప్రచురితమయ్యాయని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారని గుర్తు చేశారు. కాంతారావు కుమార్తె సుజాత పట్నాయక్‌ మాట్లాడుతూ తన తండ్రి అనేక కథలు, నవలలు రాశారని, కుటుంబంలో సాధారణ తండ్రిలా మెలిగేవారని తెలిపారు. పునర్ముద్రణకు నోచుకోని ఆయన రచనలను రాజేశ్వరరావు ప్రోత్సాహంతో విశాలాంధ్ర ప్రచురించిందని పేర్కొన్నారు. ఈ సభలో రచయిత మేడ మస్తాన్‌రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడు చింతకింది శ్రీనివాసరావు, రచయితలు అశోక్‌ బలివాడ, నండూరి రాజగోపాల్‌, ఎన్‌.కె. బాబు, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, జి. యోహాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement