మహారాణిపేట: కేజీహెచ్ ఆవరణలో మెటర్నల్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాక్ నిర్మించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి కోరారు.శనివారం ఆంధ్రా మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. వీరపాండ్యన్ కేజీహెచ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలోని పలు విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు.ఉత్తరాంధ్రలో అతిపెద్ద ఆస్పత్రిగా ఉన్న కేజీహెచ్‌లో గర్భిణులు, శిశువుల కోసం ప్రత్యేకంగా ఎంసీహెచ్ బ్లాక్ అవసరమని గైనకాలజీ విభాగం ప్రొఫెసర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని వీరపాండ్యన్ పరిశీలించారు.కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. కృష్ణవేణి, డాక్టర్ వి. రాజ్‌కమల్, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.చంద్రశేఖర నా యుడు, డాక్టర్ ఏ. గోపాలరావు, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ ఆర్వీఎస్ కుమార్, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ బి.వి. రమణ, ఇతర అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


