అవయవదానంతో పలువురికి పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

అవయవదానంతో పలువురికి పునర్జన్మ

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

ఆరిలోవ: బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ వ్యక్తి అవయవదానం ద్వారా పలువురికి ప్రాణదానం చేశాడు. అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులకు జీవన్‌ధాన్‌ బృందం కృతజ్ఞతలు తెలిపింది.అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన కోట్యాడ సూరిబాబు (40) ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని విశాఖలోని ఆరిలోవ హెల్త్‌సిటీ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.విషయం తెలుసుకున్న జీవన్‌ధాన్‌ బృందం అవయవదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా, వారు అంగీకరించారు. దీంతో అపోలో వైద్య బృందం శనివారం సూరిబాబు నుంచి రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, కార్నియాలను సేకరించింది.కిడ్నీలను నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రికి, ఊపిరితిత్తులను చైన్నెలోని ఓ ఆస్పత్రికి, కాలేయాన్ని హెల్త్‌సిటీలోని అపోలో ఆస్పత్రికి, కార్నియాలను విశాఖలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి తరలించినట్లు జీవన్‌ధాన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వి. మన్మథరావు తెలిపారు. ఈ సందర్భంగా సూరిబాబు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి ధ్రువపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement