రాత్రివేళ రోడ్డున పడ్డ ఎన్నికల సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

రాత్రివేళ రోడ్డున పడ్డ ఎన్నికల సిబ్బంది

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● అధికారుల నిర్లక్ష్యం ● ఏర్పాట్లు లేక గిరిజన మహిళల నిరసన ● ‘సాక్షి’ చొరవతో పరిష్కారం

కంచరపాలెం: నార్త్‌ జోన్‌ ఎన్నికల కేంద్రం కంచరపాలెం పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం సాయంత్రం ఎన్నికల విధులకు హాజరైన అల్లూరి జిల్లా గిరిజన మహిళా సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. పాడేరు, అరకు, కొయ్యూరు, పెదబయలు, నర్సీపట్నం ప్రాంతాల నుంచి వచ్చిన తమకు ఎన్నికల విధులు కేటాయించారని, శుక్రవారం సాయంత్రం హడావుడిగా బయలుదేరి వచ్చినా శనివారం మధ్యాహ్నం వరకు రిజర్వులో ఉంచి సాయంత్రం ఎలాంటి ఏర్పాట్లు లేకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కోరినా స్పందించే వారు లేకపోవడంతో ఎన్నికల కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఎన్నికల కమిషన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ‘సాక్షి’ని సంప్రదించగా..నార్త్‌ జోన్‌ ఆర్‌వో బాబూరావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీంతో ఆయన స్పందించి ప్రత్యేక ఎన్నికల అధికారి జ్ఞానవేణి, జోనల్‌ కమిషనర్‌ రాముకు సమాచారం అందించారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. గిరిజన మహిళా సిబ్బందికి రాత్రి భోజనం ఏర్పాటు చేయడంతో పాటు, వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement