అత్యాచార యత్నం కేసులో ఐదేళ్ల తర్వాత అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అత్యాచార యత్నం కేసులో ఐదేళ్ల తర్వాత అరెస్ట్‌

Sep 25 2026 12:59 AM | Updated on Sep 25 2026 12:59 AM

నిందితుడిని దుబాయ్‌ నుంచి రప్పించిన పోలీసులు

మల్కాపురం: మైనర్‌ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మల్కాపురం పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాపురం ప్రాంతానికి చెందిన జూరెడ్డి కిరణ్‌ 2021లో ఇదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసే సమయానికే నిందితుడు దేశం విడిచి దుబాయ్‌ వెళ్లిపోయాడు. విషయం తెలియక పోలీసులు పలు ప్రాంతాల్లో అతడి కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. అనంతరం నిందితుడు దుబాయ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇమిగ్రేషన్‌ అధికారుల సహకారంతో గురువారం ఉదయం అతడిని విదేశాల నుంచి మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. నిందితుడిని విచారించిన అనంతరం పోక్సో చట్టం కింద రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై మల్కాపురం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement