మత్స్యకారులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులను ఆదుకోవాలి

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

మహారాణిపేట: తుపాను కారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు అత్యవసర ఆర్థిక సాయం అందించాలని సీపీఎం నాయకుడు ఎం.సుబ్బారావు కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏవో బి.వి.రాణికి వినతిపత్రం అందించారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారుల భద్రత దృష్ట్యా సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించడంతో రోజువారీ వేటపై ఆధారపడే మత్స్యకార కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతోందన్నారు. మత్స్యకార కుటుంబాల సమస్యను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించి వారికి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు యు.సోమేష్‌, కె.చంద్రశేఖర్‌, ఎం.సుబ్బారావు, ఎన్‌.తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement