నకిలీ ఐడీలతో.. స్టీల్‌ప్లాంట్‌లో చోరీలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ ఐడీలతో.. స్టీల్‌ప్లాంట్‌లో చోరీలు

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

● ఏడుగురు నిందితుల అరెస్ట్‌ ● 300 కేజీల కాపర్‌ కేబుల్‌ స్వాధీనం

ఉక్కునగరం: నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి స్టీల్‌ప్లాంట్‌లోకి అక్రమంగా ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను సౌత్‌ డివిజన్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సుమారు 300 కేజీల కాపర్‌ కేబుల్‌, ఐదు నకిలీ ఐడీ కార్డులు, రెండు రబ్బర్‌ స్టాంపులు, ఐదు ఖాళీ ఐడీ కార్డులు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైమ్‌ ఏసీపీ ఎ.వెంకటరావు, సౌత్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.డి.బాబు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న పైడిపాటి వెంకట భార్గవ్‌ రాఘవ్‌తో పాటు మరికొందరు నకిలీ ఐడీ కార్డులతో స్టీల్‌ప్లాంట్‌ ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. తిరిగి వాచ్‌టవర్‌–10 వద్ద కొందరు ప్రహరీ దూకి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించగా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద నకిలీ ఐడీ కార్డులను గుర్తించి స్టీల్‌ప్లాంట్‌ పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసిన క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠాను గుర్తించారు. మల్కాపురానికి చెందిన పైడిపాటి వెంకట భార్గవ్‌ రాఘవ్‌ (38), పోతిన శ్రీకాంత్‌, గోపాలపట్నానికి చెందిన ఇసకపల్లి నాగేంద్రశర్మ (21), గాజువాకకు చెందిన గిర్గియా రవిశంకర్‌ (24), బంగారు సతీష్‌కుమార్‌ (30), ఇసకపల్లి వంశీ (27), నవాబు యువరాజ్‌ కలిసి ముఠాగా ఏర్పడి నకిలీ గుర్తింపు కార్డులతో ప్లాంట్‌లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో క్రైమ్‌ ఎస్‌ఐ వై.సాంబశివరావు, ఏఎస్‌ఐ డి.వి.రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement