అందరికీ తెలిసేలా బధిరుల సంకేత భాష | - | Sakshi
Sakshi News home page

అందరికీ తెలిసేలా బధిరుల సంకేత భాష

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

సీతంపేట: విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా బధిరుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో ప్రపంచ బధిరుల దినోత్సవం, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ, సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు మాట్లాడుతూ బధిరుల సంకేత భాష అందరికీ తెలిసేలా ప్రతి కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. బధిర ఉద్యోగుల ద్వారా ఇతర ఉద్యోగులకు వారి భాషపై అవగాహన కల్పించాలని, బధిరులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన తరువాత కూడా వారి సంఘంలో సభ్యులుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సంఘానికి సహకరించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని, జిల్లా పరిపాలన యంత్రాంగం వారికి కావలిసిన సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత మాట్లాడుతూ మూగ, బధిరులకు ప్రభుత్వం ఉచితంగా వినికిడి యంత్రాలు, టచ్‌ ఫోన్స్‌, లాప్‌టాప్స్‌ అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో బధిర సంకేత భాష ట్రాన్స్‌లేటర్‌ సునీత, బధిర సంఘం ప్రతినిధులు నరసింహమూర్తి, బేగ్‌, భవాని, శివప్రసాద్‌, చిన అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement