బీచ్‌రోడ్డు: నగరంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించాలని ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ సూచించారు. శుక్రవారం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో నగర తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. రైవాడ, ఏలేరు, మేఘాద్రిగెడ్డ జలాశయాల్లోని నీటిని సమర్థంగా వినియోగించాలని, జీవీఎంసీ, సాగునీటి శాఖలు సమన్వయంతో పనిచేయా లని ఆదేశించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచాలని సూచించారు. ఏలేరు కాలువలో పూడికతీత పనులు పూర్తయితే నీటి ప్రవాహం పెరుగుతుందని అధికారులు వివరించారు. వచ్చే ఏడాది జూన్ వరకు నగరానికి అవసరమైన నీటి నిల్వపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు గ పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, కొణతాల రామకృష్ణ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు.


