భీమిలి నియోజకవర్గంలో
వైఎస్సార్‌సీపీకి బలమైన కేడర్ ఉంది
స్థానిక సంస్థల ఎన్నికలకు
ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలి
భీమిలి అర్బన్ ప్రాంత ముఖ్యనాయకుల
సమావేశంలో కేకే రాజు
నేడు భీమిలి నియోజకవర్గ
విస్తృత స్థాయి సమావేశం
మహారాణిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం, వెన్నెముక కార్యకర్తలే అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి బలమైన కేడర్ ఉందన్నారు. వైఎస్సార్ సీపీలో అక్కడ అధినేత జగనన్న.. ఇక్కడ పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఎప్పటికీ పదిలంగానే ఉంటారన్నారు. మధ్యలో పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారు.. వాళ్ల కారణంగా పార్టీకు ఎటువంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కేకే రాజు అధ్యక్షతన భీమిలి నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ 1 నుంచి 8, 98వ వార్డుల సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులతో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించే వరకు పార్టీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన ప్రతి కార్యక్రమాన్ని ఎలాంటి విరామం లేకుండా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తగరపువలస శ్రీనివాస కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భీమిలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుందన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భీమిలి నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు రోజులుగా రూరల్, అర్బన్ మండల నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించామన్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న అనేక మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేస్తే భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి మరింత బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. పార్టీ నేతలు చెన్నాదాస్, పోతిన హనుమంతరావు, పోతిన శ్రీనువాసరావు, కొండలరావు, అక్కరమాని రామునాయుడు, మారుతీ ప్రసాద్, పోలిరెడ్డి, జగపల్లి ప్రసాద్, పోతిన ప్రసాదరావు, జగపల్లి నరేష్, కరుణాకర్ రెడ్డి, కర్రి స్వామి, కొలుసు ఈశ్వరరావు, పిల్లా సుజాత, రాజేశ్వరి, బి.పద్మావతి, అప్పల రాజు రులు పాల్గొన్నారు.


