అల్లిపురం: గిడ్డంగులు, లాజిస్టిక్స్ సేవలు, వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తూ కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యూసీ) ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పోలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. నగరంలో శుక్రవారం నుంచి ఈ నెల 13 వరకు జరుగుతున్న ఎక్స్‌పోలో సీడబ్ల్యూసీ, ప్రాంతీయ కార్యాలయం–అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో సుమారు 9.77 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో సీడబ్ల్యూసీ సేవలు అందిస్తోంది. ఆధునిక శాసీ్త్రయ గిడ్డంగులతో పాటు రోడ్డు రవాణా, కంటైనర్ రైలు లాజిస్టిక్స్, సరకు నిర్వహణ, పెస్ట్ కంట్రోల్, ధాన్య నాణ్యత పరీక్షలు, ఇతర విలువ ఆధారిత సేవలను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.


