పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 130 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 130 ఫిర్యాదులు

Aug 11 2026 1:54 AM | Updated on Aug 11 2026 1:54 AM

అల్లిపురం: నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 130 ఫిర్యాదులు అందినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని సబ్‌డివిజన్‌ ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీపీ స్వయంగా పాల్గొని బాధితుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.

అందిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలు, మోసాలకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement