నిద్రలేక ప్రయాణికుల నరకయాతన
సాక్షి, విశాఖపట్నం: సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12739)లో నల్లుల బెడదతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఓ ప్రయాణికుడు గరీబ్ రథ్ లో పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాను ప్రయాణిస్తున్న జీ–10 కోచ్‌తో పాటు జీ–8 కోచ్‌లోనూ నల్లులు విపరీతంగా ఉన్నాయని, అవి కుట్టడంతో ప్రయాణికులు రాత్రంతా నిద్రలేక నరకయాతన అనుభవించారని ఆయన వాపోయారు. ఈ సమస్యపై అధికారులకు, టీటీఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రైల్వే శాఖ తక్షణమే స్పందించి కోచ్‌లను శుభ్రం చేయాలని కోరారు. ప్రయాణికులు తమ ఇళ్లకు చేరుకున్న తర్వాత లగేజీని ఎండలో పెట్టుకోవాలని, లేదంటే నల్లులు ఇళ్లకు కూడా చేరే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


