కోస్ట్‌ గార్డ్‌ ఈస్టర్న్‌ సీబోర్డ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా అనురాగ్‌ కౌశిక్‌ | - | Sakshi
Sakshi News home page

కోస్ట్‌ గార్డ్‌ ఈస్టర్న్‌ సీబోర్డ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా అనురాగ్‌ కౌశిక్‌

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

మల్కాపురం: విశాఖలోని కోస్ట్‌ గార్డ్‌ ఈస్టర్న్‌ సీబోర్డ్‌ ప్రధాన కార్యాలయం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అనురాగ్‌ కౌశిక్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1995 జూలై 8న ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో చేరిన ఆయన కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌, న్యూఢిల్లీలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీలలో ఆయన విద్యనభ్యసించారు. తన 31 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో హోవర్‌క్రాఫ్ట్‌ 187, ఐసీజీఎస్‌ సుజయ్‌, కోస్ట్‌ గార్డ్‌ స్టేషన్‌ వాడినార్‌ తదితర ప్రతిష్టాత్మక విభాగాలకు కమాండర్‌గా వ్యవహరించడంతో పాటు పలు కీలక హోదాల్లో పనిచేశారు.ఈ నూతన బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన కోస్ట్‌ గార్డ్‌ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ (కమ్యూనికేషన్‌, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ)గా సేవలు అందించారు. అనురాగ్‌ కౌశిక్‌ ప్రతిభకు గాను ప్రతిష్టాత్మక ’తటరక్షక్‌ పతకం’ (శౌర్య పురస్కారం) వరించింది. అలాగే డీజీఐసీజీ నుంచి ఆయన రెండుసార్లు ప్రశంసా పత్రాలు కూడా అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement