పాలిటెక్నిక్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్ కేవీ
మురళీనగర్: కంచరపాలెం (విశాఖపట్నం) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్) ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణను నియమిస్తూ రాష్ట్ర సాంకేతిక శాఖ డైరెక్టర్ జి. గణేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేస్తున్న ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. నారాయణరావు బదిలీ కావడంతో, తొలుత మెటలర్జీ విభాగం హెడ్ డాక్టర్ కె. రత్నకుమార్‌ను ఈ బాధ్యతల్లో నియమించారు. అయితే తాజాగా అనూహ్య పరిణామాల మధ్య డాక్టర్ కేవీ రమణకు ఈ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాల పూర్తి స్థాయి ప్రిన్సిపాల్ జీవీవీ సత్యనారాయణమూర్తి సాంకేతిక విద్యా శాఖ ఇన్‌చార్జి సెక్రటరీగా డిప్యుటేషన్‌పై వెళ్లడంతో కొంతకాలంగా ఈ కళాశాల ఇన్‌చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ఈ పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రభుత్వం చివరికి కేవీ రమణను నియమించడంతో ఆ ప్రయత్నాలకు తెరపడింది.


