వెలుగురేఖ సమైక్య
ఇద్దరు విద్యార్థులను చదివిస్తున్నా
శ్రీకాకుళంలో విద్యనభ్యసించి, విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సత్యనారాయణ సర్ ఆర్థిక సహకారంతో బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించా. 2018లో ఐడీబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఎంపికై , ప్రస్తుతం మధురవాడ బ్రాంచ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నాపై చూపిన ఉదారతను స్ఫూర్తిగా తీసుకుని, ప్రస్తుతం మా ఊరిలో ఇద్దరు విద్యార్థుల పూర్తి విద్యా ఖర్చులను నేను భరిస్తున్నాను.
– రేగాన సింహాచలం, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ మధురవాడ
అమ్మ కష్టాన్ని చూసి ఆదుకున్నారు!
‘మాది రాజాం. మా అమ్మ ఐస్‌క్రీం పార్లర్‌లో పనిచేస్తూ మమ్మల్ని చదివించేది. సత్యనారాయణ సార్ నా ప్రతిభను గుర్తించి ఇంటర్ నుంచి సీఏ పూర్తయ్యే వరకు దాదాపు రూ.65 వేలు ఖర్చు చేసి చదివించారు. నేడు విప్రోలో చార్టెడ్ అకౌంటెంట్‌గా నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నా. సార్ స్ఫూర్తితో నేను కూడా ఇప్పుడు ఒక విద్యార్థిని చదివిస్తున్నా.
– భవిరిశెట్టి కోటేశ్వరరావు, సీఏ, విప్రో
తాటిచెట్లపాలెం: ఒక చిన్న దీపం వేల జీవితాల్లో వెలుగులు నింపగలదు. ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది ‘సమైక్య’ సంస్థ. విశాఖ రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సూరిశెట్టి సత్యనారాయణ (అనకాపల్లి జిల్లా, రాజుపేట గ్రామం) తన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు.
● చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, కష్టాలే ఆయన్ని ఈ మార్గంలో నడిపించాయి. ‘చదువు ఒక్కటే తరాల తలరాతను మార్చగలదు‘ అని నమ్మే ఆయన, ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆ సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఆయన వద్ద సాయం పొందిన విద్యార్థులు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ, తిరిగి మరికొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఈ ’సమైక్య’ సాధించిన అసలైన విజయం.
ప్రతిభావంతులకు ఆర్థిక ప్రోత్సాహం
నా గత అనుభవాలు, పల్లెటూరి విద్యార్థుల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే ప్రతిభావంతులకు అండగా నిలవాలనే సంకల్పం భగవంతుడు కలిగించాడు.పేదరికం నుంచి విముక్తి , భావితరాల భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉంది.ఆకలి బాధ తెలిసిన వాడికే అన్నం విలువ తెలిసినట్లు, పేద విద్యార్థులకు మనం ఇచ్చే ప్రతి రూపాయి వారి కలలకు ప్రాణం పోస్తుంది. సరైన ప్రోత్సాహం, భరోసా ఉంటే ఆ విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మరింత దృఢంగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఇదే ఆశయంతో, ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నుముకగా నిలిచేందుకు ‘సమైక్య’ నిరంతరం కృషి చేస్తోంది.
– సత్యనారాయణ, ౖరెల్వే అధికారి, విశాఖపట్నం
ప్రతి అడుగులో తోడున్నారు!
రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను నేడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈ)లో జూనియర్ ఇంజనీర్‌గా ఉండటానికి సత్యనారాయణ, సమైక్య టీమ్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. పరీక్షలకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి, ఉద్యోగంలో చేరే వరకు ప్రతి దశలో వారు నాకు మార్గనిర్దేశం చేశారు. మాలాంటి ఎంతోమంది యువతకు సమైక్య ఒక వెలుగురేఖ.
–దాడి వెంకటేశ్వర స్వామి, జూనియర్ ఇంజనీర్, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్
కరపత్రం నా జీవితాన్ని మార్చింది!
బిటెక్ చదివే రోజుల్లో గేట్ కోచింగ్‌కు డబ్బుల్లేక లైబ్రరీలో చదువుకునే వాడిని. అక్కడ నోటీసు బోర్డుపై సత్యనారాయణ నంబర్ చూసి సంప్రదించా. ఆయన నన్ను కోచింగ్‌లో చేర్పించి, ఆర్థిక సాయంతో పాటు నిరంతరం గైడెన్స్ ఇచ్చారు. నేడు బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో టెక్నికల్ డిజైనర్‌గా స్థిరపడ్డా.
– షేక్ తాజ్ అహ్మద్, ప్యుస్ట్ గ్లోబ్ కంపెనీ
పేద విద్యార్థులకు బాసట
దత్తత తీసుకుని ప్రోత్సాహం
రైల్వే ఉన్నతాధికారి సత్యనారాయణ ఆదర్శం
కొనసాగిస్తున్న సేవాయజ్ఞం
వంద మందికి ఆసరా ఇవ్వడమే లక్ష్యం
వెలుగురేఖ సమైక్య
వెలుగురేఖ సమైక్య
వెలుగురేఖ సమైక్య
వెలుగురేఖ సమైక్య
వెలుగురేఖ సమైక్య


