27న భీమిలిలో జాబ్ మేళా
మురళీనగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. ఈ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొని 800కి పైగా ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఏదైనా డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా అర్హత ఉండి, ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిట్ కార్డ్‌తో హాజరు కావాలని తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 901475 8949 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. అదే రోజు భీమిలి పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్‌లో ఐటీ సెక్టార్‌కి చెందిన సెక్యూరిటీ అనలిసిస్ట్ కోర్స్‌లో చేరడానికి ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా బీటెక్ అర్హత కలిగి ఆసక్తి కలిగిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు.


