
తల్లి నేత్రాలు దానం
పెద్ద మనసు చాటుకున్న రాకేష్
పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన తల్లి నేత్రాలను దానం చేసి ఒక కుమారుడు మానవత్వాన్ని చాటుకున్నాడు. పెందుర్తిలోని రాచ్చెరువు ప్రాంతానికి చెందిన 46 ఏళ్ల బత్తుల వరలక్ష్మి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ గురువారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్.. వరలక్ష్మి నేత్రాలను దానం చేయాల్సిందిగా ఆమె కుమారుడు రాకేష్‌ను కోరారు. రాకేష్‌తో పాటు కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు. దీంతో మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధి మనోజ్ తన బృందంతో వచ్చి వరలక్ష్మి నేత్రాలను సేకరించారు.