
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోం
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల నిరసన
డాబాగార్డెన్స్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తమ గళం వినిపించారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) పేరుతో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌లోని 44 విభాగాలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వారు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన గేటు వద్ద నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు.
ఉద్యమాల ఫలితంగానే
స్టీల్‌ప్లాంట్
ఉద్యమాల ఫలితంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పడింది. మా ప్రభుత్వ హయాంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – బాణాల శ్రీనివాసరావు,
వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్
ఉద్యోగులను తొలగించడం బాధాకరం
తెన్నేటి విశ్వనాథం స్ఫూర్తితోనే స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు నాంది పడింది. ఎంతోమంది త్యాగాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడమే కాకుండా, ఉద్యోగులను తొలగించడం బాధాకరం.
– రెయ్యి వెంకటరమణ, కార్పొరేటర్
దశల వారీగా ప్రైవేటీకరణ
చేస్తున్నారు
స్టీల్‌ప్లాంట్‌ను దశలవారీగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. కౌన్సిల్‌లో ఈ అంశంపై గట్టిగా గళం వినిపిస్తాం. ప్లాంట్‌లోని కీలక విభాగాలను 44 ముక్కలుగా చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం దారుణం.
– కె.సతీష్, డిప్యూటీ మేయర్, జీవీఎంసీ

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోం

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోం

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోం